చైనాలో కార్చిచ్చు బీభత్సం 11 d ago

చైనాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ లింగ్ చౌన్ కౌంటీలో మంగళవారం కార్చిచ్చు చెలరేగింది. గత శనివారం పొరుగున ఉన్న హుగువాన్ కౌంటీలో చెలరేగిన ఈ కార్చిచ్చు.. ఆదివారం బలమైన గాలుల కారణంగా లింగ్చువాన్ లియుక్వాన్ టౌన్ షిప్ వరకు వ్యాపించిందని స్థానిక అధికారులు వెల్లడించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఈ మంటలను అదుపుచేసేందుకు ఐదు హెలికాప్టర్లను.. 3వేల మందికి పైగా సిబ్బందిని రంగంలోకి దించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు లింగ్ చౌన్ నుంచి 266 మందిని ఖాళీ చేయించగా.. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.